- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనా సరిహద్దులో ముగ్గురు సైనికులు మృతి
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో ఇరుదేశాల సైనికుల మధ్య ఏర్పడ్డ ఘర్షణల్లో మనదేశానికి చెందిన ఒక ఆర్మీ అధికారి, మరో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని భారత ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
మనదేశానికి చెందిన ఓ ఆర్మీ అధికారి సహా ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అయితే, అదే ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాల సీనియర్ మిలిటరీ అధికారులు చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సో, సిక్కింలోని నాకు లా ఏరియాలో ఇరుదేశాల సైనికుల మధ్య మే నెల తొలినాళ్లలో ఘర్షణలు ఏర్పడిన అనంతరం సరిహద్దు గుండా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే శాంతి నెలకొల్పేందుకు మిలిటరీ అధికారుల స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.