భారత్‌లో కొవిడ్ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించిన గూగుల్

by vinod kumar |
భారత్‌లో కొవిడ్ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించిన గూగుల్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి గురించి పూర్తిస్థాయి అధికారిక సమాచారాన్ని అందించే భారత్‌కి మాత్రమే పరిమితమైన వెబ్‌సైట్‌ని గూగుల్ ప్రారంభించింది. www.google.co.in/covid19 వెబ్‌సైట్‌లో ప్రధానమైన హెల్ప్‌లైన్ నంబర్లు, వ్యాధి లక్షణాలు, రక్షణ విధానాలు, అందుబాటులో ఉన్న ట్రీట్‌మెంట్లతో పాటు అంతర్జాతీయ, జాతీయ స్థాయుల్లో కరోనా బాధితుల సంఖ్యకు సంబంధించిన అప్‌డేట్ వివరాలు పొందుపరిచారు.

అలాగే ఇంటి దగ్గర ఉండి చేయగల పనుల గురించి కొన్ని వీడియోలను, సమయాన్ని వినియోగించుకోవడం గురించి ట్రైనింగ్ మాడ్యూళ్లు, చిన్న వ్యాపారుల కోసం ఐడియాల సమాచారం కూడా ఈ సైట్లో ఉంది. ఆరోగ్య సమాచారం, రక్షణ నివారణ చిట్కాలు, ఇతర డేటా సెక్షన్లు ఇందులో ఉన్నాయి. చేతులు కడుక్కోవడం, వ్యాధి లక్షణాలు, సత్ప్రవర్తనకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వారి వీడియోలు కూడా పొందుపరిచారు. ఇంకా కరోనా వైరస్‌కి సంబంధించి ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశాల లింకులను కూడా ఇందులో ఉంచారు. వీటిలో సోషల్ డిస్టెన్సింగ్ లాభాలు, లాక్‌డౌన్ అర్థం, సెల్ఫ్ ఐసోలేషన్, క్వారంటైన్ మధ్య తేడాలు వంటి అంశాలు ఉన్నాయి.

Tags: Corona, Covid, google, covid19, website

Advertisement

Next Story

Most Viewed