ఇండియా ఇంట్లోనే..!

by Shamantha N |
ఇండియా ఇంట్లోనే..!
X

న్యూఢిల్లీ : ఆదివారం ఉదయం ఏడుగంటల నుంచి ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటిబయట అడుగుపెట్టలేదు. స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. తెలంగాణలో ఆరుగంటలకే ఈ కర్ఫ్యూ ప్రారంభమైంది. కిరాణా షాపులు, టీకొట్టులు, రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు, మాల్స్ ఏవీ తెరుచుకోలేదు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అడపాదడపా మినహా రోడ్లపై ప్రైవేటు వాహనాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రజలూ స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు.

శనివారం, ఆదివారం రాత్రుల్లు ముంబయి నగరానికి కంటి మీద కునుకుపట్టదు. అటువంటిది ఆదివారం ఉదయం నుంచే నగర రోడ్లు ఖాళీగా కనిపించాయి. గుజరాత్‌లోని నాలుగు నగరాలు ఈ నెల 25 వరకూ లాక్‌డౌన్ పాటించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.

Tags: coronavirus, janata curfew, modi, roads, closed, remained, people

Advertisement

Next Story