- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దేశంలో 24 గంటల్లోనే 149 కరోనా కేసులు

న్యూఢిల్లీ : ఇండియాలో సింగిల్ డేలో వెలుగుచూస్తున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 149 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను 724గా పేర్కొంది. కాగా, శనివారం ఉదయం ఈ సంఖ్య 873గా వెల్లడించింది. అంటే 24 గంటల్లోనే కొత్తగా 149 కరోనా కేసులు వెలుగు చూసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం నాటికి కరోనాతో బాధపడుతూ 19 మరణించినట్టు వివరించింది. భారత్ 21 రోజుల లాక్ డౌన్ లో భాగంగా నేడు నాలుగో రోజు బంద్ పాటిస్తున్నది. కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరో 12 నుంచి 18 నెలల సమయం పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే.
Tags: Coronavirus, india, death toll, cases, count