భారత్‌కు రష్యా ఆయుధాలు.. అమెరికా మౌనం వెనుక కారణం అదేనా..

by Shamantha N |   ( Updated:2021-12-06 01:21:43.0  )
Putin
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. దాదాపు రూ.5 వందల కోట్ల ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఇందులో రష్యా అత్యాధునిక మిస్సైల్స్ ఎస్-400 కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు విచ్చేయనున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల్లో అనేక సందేహాలు మెదులుతున్నాయి. తన మిత్ర దేశాలు రష్యా వద్ద ఎటువంటి కొనుగోలు చేసినా అంగీకరించని అమెరికా ఇప్పుడెందుకు మౌనంగా ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రష్యా రక్షణ మండలికి సంబంధించిన ఓ అధికారి స్పందించాడు.

‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఢీ కొట్టాలంటే అమెరికాకు భారత్ బలం, సహాయం చాలా అవసరం. అందుకే అమెరికా ఈ వర్తకం విషయంలో కళ్లు మూసుకుని ఉండవచ్చ’ని అన్నారు. గతంలో నాటో (NATO) టర్కీ- అంకారాతో చేసిన ఎఫ్-35 జెట్ల విషయంలో అమెరికా అంకారాపై బ్యాన్ విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ భారత్ విషయంలో అలా జరగదని, ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా ఆగడాలను కట్టించేందుకు ఏర్పడిన యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్‌ల గ్రూప్‌లో భారత్ కూడా కీలక భాగస్వామి అని ఆయన అన్నారు. ఏది ఏమైనా భారత్-రష్యా వర్తకంపై అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే రష్యా ఆయుధ బలం భారత్‌కు చాలా అవసరం ఉంది. ఎందుకంటే భారత సరిహద్దుల్లో చైనా బలగాలు ఇంకా వెనక్కి తగ్గలేదు, దీంతో ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆయుధ సంపత్తి పుష్కలంగా ఉండాలి. దాంతో పాటుగా ఆఫ్ఘన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం కూడా భారత్‌కు బ్యాడ్ సిగ్నల్ అనే చెప్పాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే భారత్ విస్తృత కొనుగోళ్లు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed