‘పాక్, చైనాల భూభాగాలు భారత్‌కు అవసరం లేదు’

by Shamantha N |
‘పాక్, చైనాల భూభాగాలు భారత్‌కు అవసరం లేదు’
X

న్యూఢిల్లీ: భారత్ భూ ఆక్రమణల ద్వారా విస్తరించాలని భావించడం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. పాకిస్తాన్ భూభాగం వద్దు, చైనా భూభాగమూ వద్దని తెలిపారు. భారత్ కేవలం శాంతి, సోదరభావాన్ని కోరుకుంటున్నదని వివరించారు. చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన గుజరాత్ జన సంవద్ ర్యాలీని ఉద్దేశిస్తూ ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయాల గురించి ప్రస్థావిస్తూ.. దేశం లోపల, వెలుపల భద్రతను స్థాపించడంలో కేంద్రం సక్సెస్ అయిందని తెలిపారు. అది మావోయిస్టుల సమస్య అయినా, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమైనా మోడీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని శాంతిని స్థాపించగలిగిందని వివరించారు. ఇది పటిష్టమైన దేశానికే సాధ్యమని పేర్కొన్నారు.

భూ ఆక్రమణలతో విస్తరిస్తూ దేశాన్ని పటిష్టం చేయరాదని, శాంతిని నెలకొల్పుతూ ఆ పనిచేయాలని అన్నారు. భూటాన్ నుంచి ఇంచు భూమి కూడా భారత్ ఆక్రమించుకోలేదని, 1971లో పాకిస్తాన్‌పై విజయం సాధించి స్వతంత్ర బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసి మన సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చుకున్నామని పలు ఉదాహరణలు గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed