హైదరాబాద్‌లో చంద్రబాబు.. మూలధనం ముచ్చట

by srinivas |
Chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం అని ఆయన అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను, వ్యవస్థలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే జాతీయ వీరులకు మనం అందించే నిజమైన నివాళి అని చంద్రబాబు చెప్పారు.

Advertisement

Next Story