- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంచలన నిర్ణయం.. TS హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు

X
దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు సీజేఐ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 24 మంది న్యాయమూర్తులతో కొనసాగుతున్న తెలంగాణ హైకోర్టులో 42 మందికి పెంచింది. సీజేఐ ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగిన విషయం తెలిసిందే. సంబంధిత ఫైలుకు ఆయన బుధవారం ఆమోదం తెలిపారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నించారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75శాతం పెంచారు.
Next Story