- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోవాలో ఆక్సిజన్ అందక 13మంది మృతి
దిశ, వెబ్ డెస్క్ : ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గోవామెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక శుక్రవారం తెల్లవారుజామున 13 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ నాలుగురోజుల్లోనే 74 మంది కరోనా బాధితులు ఆక్సిజన్ అందక మృతి చెందారు. గురువారం15 మంది చనిపోగా, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది ఆక్సిజన్ మరణించారు. అయితే వీరందరూ ఆక్సిజన్ సరఫరా అందుబాటులో లేకపోవడంతో మృతిచెందినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ఆక్సిజన్ రవాణలో ఏర్పడిన కారణంగానే ఈ సమస్యలు ఎదురైనట్లు రాష్ట్రప్రభుత్వం చెబుతుంది. అయితే ఈఘటన పై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో రాష్ట్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆక్సిజన్ కోసం గోవాలో ఆందోళన మొదలైంది. అన్ని రాష్ట్రాలలానే గోవాకూడా కేంద్రాన్ని సంప్రదించింది. పది రోజుల్లో రాష్ట్రానికి కేవలం 40 టన్నుల ఆక్సిజన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రోజువారీ కేటాయింపులను 11 టన్నుల నుంచి 22 టన్నులకు పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.