మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం :ఐఎంఎఫ్

by  |   ( Updated:2020-09-11 04:23:45.0  )
మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం :ఐఎంఎఫ్
X

దిశ, వెబ్‌డెస్క్:

భారత్‌లో మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)అభిప్రాయపడింది. బలహీన గృహస్థులకు ఆదాయ మద్దతుగా ఖర్చుల కోసం.., అలాగే ఆరోగ్య, ఆహార రంగాల్లో వ్యయం చేసేందుకు, కుదేలైన వ్యాపారాలకు అండగా నిలబడేందుకు మరో ఉద్దీపన అవసరమని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ నమోదు చేసిన జీడీపీ (GDP)సంకోచంపై స్పందించిన IMF కమ్యూనికేషన్‌ విభాగం డైరెక్టర్‌ గెర్రీ రైస్‌.. ‘కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతు ఇస్తున్నామని అన్నారు. తక్కువ ఆదాయమున్న కార్మికులు, ప్రజలకు, ఆర్థిక రంగానికి ద్రవ్య లభ్యత కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరింత ఉద్దీపన ప్యాకేజీ భారత్‌కు అవసరమని గెర్రీ రైస్ చెప్పారు.

Advertisement

Next Story