ఫిలింఫేర్ కవర్ పేజీపై మెగా బ్రదర్స్.. వ్వావ్ వాటే ఫోటో

by Shyam |   ( Updated:2021-06-08 00:02:22.0  )
ఫిలింఫేర్ కవర్ పేజీపై మెగా బ్రదర్స్.. వ్వావ్ వాటే ఫోటో
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క రాజాలకీయాలతోను, మరోపక్క సినిమాలతో బిజీ గా మారారు. ఇక ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. పవన్ కళ్యాణ్ చిన్నతనం నుండి చాలా రిజర్వడ్ గా ఉంటారన్న విషయం తెల్సిందే. ఇక ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి మాట వలనే సినిమాలు వైపు దృష్టి సారించారన్న విషయం కూడా విదితమే. పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ చాలానే శ్రమించారు. ఇక వీరిరువురు ఒక చోట కనిపిస్తే ఫాన్స్ కి పండగే. పవన్ ఎక్కువగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపించడు.. అందుకే మెగా ఫ్యామిలీ తో పవన్ దిగిన రేర్ ఫోటోలు ఎప్పుడు నెట్టింట వైరల్ గా మారతాయి. తాజాగా ఈ మెగా బ్రదర్స్ త్రో బ్యాక్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

1997 ఫిబ్రవరి లో ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటోగ్రాఫ్ పై మెగాస్టార్ చిరంజీవి వెనుక అమాయకమైన మోముతో పవన్ కళ్యాణ్ అన్నను కౌగిలించుకొని ఉన్నాడు.'కాచింగ్ ది కరెంట్స్ ఆఫ్ తెలుగు సినిమా’ అనేది కవర్ శీర్షిక. 'బ్రదర్ యాక్ట్' అనేది ప్రధాన శీర్షికగా అన్నదమ్ములపై చక్కని కవర్ స్టోరి వెలువడింది. నార్మల్ గానే పవన్ కి ఫోటోషూట్ లు నచ్చవు..ఈ ఫొటోలో కూడా పవన్ హావభావాలు అలాగే ఉన్నాయి. ఆ చురుకైన చూపులు..కాస్త అమాయకత్వం,గుబురు గడ్డం మీసకట్టు.. పక్క పాపిడితో పవన్ ఎంతో స్టైలిష్ గా స్మార్ట్ గానూ కనిపిస్తున్నారు. ఇక చిరు లుక్ చూస్తుంటే హిట్లర్, బావగారు బావున్నారా సినిమాలు చేస్తున్నప్పుడు తీసింది అన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫోటోను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ 'ఇప్పుడే వచ్చింది !!! వ్వావ్ వాటే ఫోటో.. వ్వాటే మూవ్ మెంట్ !!! చిరు సర్.. పవన్ సర్ .. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Advertisement

Next Story