స్వర్ణ ప్యాలెస్ ఘటనలో వైద్యులపై చర్యలు వద్దు

by srinivas |
స్వర్ణ ప్యాలెస్ ఘటనలో వైద్యులపై చర్యలు వద్దు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై ఏపీ డీజీపీకి ఐఎంఏ లేఖ రాసింది. ఈ ప్రమాదంలో వైద్యులను దోషులుగా చూడొద్దని విన్నవించింది. కోవిడ్ కేర్ సెంటర్లను నడిపేందుకు ప్రభుత్వమే అనుమతించిందన్న విషయాన్ని ఐఎంఏ గుర్తుచేసింది.

అత్యవసర పరిస్థితుల్లోనే ప్రైవేట్ కేర్ సెంటర్లకు అనుమతులిచ్చిందని లేఖలో పేర్కొంది. కరోనా కట్టడికి వైద్యులు పోరాడుతున్నారని.. ఈ ఘటనపై రమేశ్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని బాధ్యులను చేయడం తగదని డీజీపీకి సూచించింది. ఎట్టిపరిస్థితుల్లో వైద్యులపై చర్యలు తీసుకోకుండా ఉండాలని కోరింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మెయిల్ ద్వారా లేఖను పంపింది ఐఎంఏ.

Advertisement

Next Story