బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఐఎంఏ షాకింగ్ డెసిషన్

by Sridhar Babu |
ima 2
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రసిద్ధ యోగ గురువు రాందేవ్ బాబా అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ తీవ్రంగా మండిపడింది. గురువారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డా. ఎం.వసంతరావు మాట్లాడుతూ.. రాందేవ్ బాబా మాట్లాడిన తీరును నిరసిస్తూ, ఈ నెల 18 శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓ. పి విభాగం బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో అల్లోపతి వైద్యం ఎంతగానో పాటుపడుతుందన్నారు. అదే విధంగా తమ ప్రాణాలకు తెగించి, కరోనా రోగులకు చికిత్స అందించిన వందల మంది వైద్యులు విధినిర్వహణలో కరోనా బారిన పడి మరణించిన సంఘటనలున్నాయని పేర్కొన్నారు. వారిని గుర్తించకుండా, అల్లోపతి వైద్యం పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని మండి పడ్డారు. వెంటనే తన మాటలు వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షములో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed