- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
23న డాక్టర్ల 'బ్లాక్ డే' నిరసన
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్‌ను చూసి యావత్ ప్రపంచమే భయపడుతుంటే.. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి పేషెంట్లకు సేవలందిస్తున్నారని, వృత్తిధర్మంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నా వారిపై దాడులు ఆగడంలేదని, వీటి నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎంతో శ్రమకోర్చి వైద్యసేవలందిస్తున్నా.. దేశవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో హింస, దాడులు జరుగుతూనే ఉన్నాయని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రంజన్ శర్మ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోకన్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి యావత్తు వైద్య సిబ్బంది దూషణలకు, భౌతిక దాడులకు, ఉన్నతాధికారుల వేధింపులకు గురవుతున్నారని, ఇంతకాలం చాలా సహనంతో ఉన్నామని, ఆ సహనానికీ ఒక హద్దు ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడులకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా కఠిన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్‌లో భాగంగా ఈ నెల 22వ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు మొత్తం దేశమంతటా డాక్టర్లు, నర్సులు, హెల్త్‌కేర్ సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి ప్రభుత్వానికి ‘వైట్ అలెర్ట్’ సందేశాన్ని ఇవ్వాలని అన్ని రాష్ట్రాల యూనిట్లకు ఐఎంఏ సర్క్యులర్ పంపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తూనే అలాంటి చట్టం తీసుకురాని పక్షంలో ఈ నెల 23వ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, ‘బ్లాక్ డే’ నిరసన పాటించాలని పిలుపునిచ్చింది. ఇప్పటికీ డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది ఒకవైపు ఆస్పత్రుల్లో ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని, ఇది పరోక్షంగా ప్రభుత్వాలకు తెలిసి జరుగుతున్నదేనని.. మరోవైపు అద్దె ఇళ్ళ యజమానుల నుంచి, ఇరుగుపొరుగువారి నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారని, ఒక రకంగా సామాజికంగా బహిష్కరణకు గురవుతున్నారని అధ్యక్ష, కార్యదర్శులు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ఇప్పటిదాకా ప్రధాని పిలుపు మేరకు డాక్టర్లు, నర్సులు, యావత్తు వైద్య సిబ్బందికి మద్దతుగా, సంఘీభావంగా చప్పట్లు కొట్టి, కొవ్వొత్తులు వెలిగిస్తే.. ఇప్పుడు వేధింపులు, బహిష్కరణలు, భౌతికదాడులకు కఠిన చట్టం తీసుకురావాలని అదే కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్నారు. చప్పట్లు, కొవ్వొత్తి వెలుగులతో సంఘీభావం పనిచేయక చివరకు ఆస్పత్రుల్లో పోలీసు ఔట్ పోస్టులు, భద్రత కల్పించాల్సి వచ్చింది. చివరకు ఇది కూడా వాటిని అడ్డుకోలేకపోవడంతో కఠిన చట్టం అవసరం ఏర్పడింది.
Tags: Black day, Doctors, Nurses, Medical staff, Circular, IMA