- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ రవాణాలో కీలకంగా మారిన గాడిదలు..
by Shyam |
X
దిశ, పుల్కల్: ఇసుక అక్రమ రవాణా కొరకు అక్రమదారులు కొత్త కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. ఈ క్రమంలో నది పరివాహక ప్రాంతలోకి ట్రాక్టర్‌లు వెళ్లడం కష్టంగా మారడంతో వారు ఏకంగా అక్కడికి గాడిదలను పంపి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలో గల మంజీరా నది నుండి అర్ధరాత్రి సమయంలో అధికారుల కళ్ళు కప్పి అక్రమ రవాణా చేస్తున్నారు. పరివాహక ప్రాంత రైతుల పంటలు ఇసుక అక్రమ రవాణా వల్ల భీట్లుగా మారుతున్నాయని వాపోతున్నారు. ఇసుకను నదిలోపలి నుండి గాడిదల ద్వారా ఒడ్డుకు తెచ్చి ట్రాక్టర్‌లతో అక్రమంగా తరలిస్తున్నారని రైతులు తెలిపారు. ఈ విషయంపై అధికారులు త్వరగా స్పందించాలని రైతులు కోరుకుంటున్నారు.
Advertisement
Next Story