గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు

by Anukaran |   ( Updated:2020-10-12 12:12:06.0  )
గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు
X

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ సెంటర్లపై సివిల్ సప్లై, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం దాడులను నిర్వహించారు. మండల పరిధిలోని ఇస్నాపూర్ లో గత కొంతకాలంగా అక్రమ రిఫిలింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇస్నాపూర్ లో గల పద్మరావు నగర్ లో ఐఓసీ పెట్రోల్ బంక్ వెనకాల అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ నడుపుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు దాడులను నిర్వహించారు. అక్రమంగా రిఫిల్లింగ్ చేస్తున్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 8 పెద్ద సిలిండర్లు, 64 చిన్న సిలిండర్లను, గ్యాస్ ఫిల్లింగ్ కు సంబంధించిన పైపులను సీజ్ చేసి నందిగామ లోని గోదాంకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్ మాట్లాడుతూ.. గృహ సముదాయాల్లో అక్రమంగా రిఫిల్లింగ్ నడపడం చట్ట రిత్యా నేరమని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారు ఎంతటి వారైనా సరే కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story