ఐకియా ఇండియా నష్టం రూ. 720 కోట్లు

by Shamantha N |
ఐకియా ఇండియా నష్టం రూ. 720 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫర్నిచర్ రిటైలర్ ఐకియా ఇండియా 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని రూ. 720.1 కోట్ల నష్టంతో ముగించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐకియా ఇండియా రూ. 685.4 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అయితే, నికర అమ్మకాలు గతేడాదిలో రూ. 343.7 కోట్ల నుంచి 64.68 శాతం పెరిగి రూ. 566 కోట్ళను చేరుకున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఐకియా ఇండియా మొత్తం ఆదాయం 63.18 శాతం పెరిగి రూ. 665.6 కోట్లుగా ఉందని, ఇతర ఆదాయాలు రూ. 99.6 కోట్లకు పెరిగాయని పేర్కొంది.

భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా భావించే ఐకియా మొదటిసారిగా 2018, హైదరాబాద్‌లో మొదటి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. అనంతరం ముంబై, హైదరాబాద్, పూణెలలో ఆన్‌లైన్ స్టోర్లను ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో ఐకియా తన రెండో రిటైల్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘ ఐకియాకు భారత్ కీలకమైన మార్కెట్. వినియోగదారులు ప్రత్యేక షాపింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకు కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని’ ఐకియా ఇండియా సీఎఫ్ఓ ప్రీత్ ధూపర్ వెల్లడించారు.

Advertisement

Next Story