- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పైన్ నీడిల్స్‌తో ‘కాగితం తయారీ’ చేసిన రూర్కీ పరిశోధకులు
దిశ, ఫీచర్స్ : పర్యావరణానికి, మానవాళికి.. ప్లాస్టిక్ చేసే విఘాతం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాకేజింగ్ కవర్ల కోసం అధిక మొత్తంలో ప్లాస్టిక్ వాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్ వైపు అడుగులేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో ఐఐటి రూర్కీ పరిశోధకులు పైన్ నీడిల్ వ్యర్థాలతో ఫంక్షనల్ పేపర్‌ను అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో స్థిరమైన ఆహార ప్యాకేజింగ్ పదార్థాలను సృష్టించేందుకు ఇది తొలి అడుగు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నికర వార్షిక పైన్ నీడిల్ వ్యర్థాల దిగుబడి దాదాపు 1.3 మిలియన్ టన్నులు కాగా వీటి కారణంగానే అడవుల్లో మంటలు చెలరేగి, చెట్లు దగ్దమవుతున్నాయి. అంతేకాదు పైన్ నీడిల్స్ కాల్చడం వల్ల తీవ్రస్థాయిలో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే పైన్ నీడిల్స్‌ను తెలివిగా వాడుకుంటే ప్రకృతికి మేలు జరుగుతుందని గ్రహించిన ఐఐటీ రూర్కీ పరిశోధకులు, పైన్ నీడిల్స్‌పై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. వీటిలో 41% సెల్యులోజ్ ఉంటుందని పరిశోధనలో తేలగా, వాటి అధిక సెల్యులోసిక్ కంటెంట్ కారణంగా కాగితంగా రూపాంతరం చెందడానికి అనువైనవని పరిశోధకులు గుర్తించారు. అలా తొలి ఇథిలీన్ స్కావెంజింగ్ ఫంక్షనల్ పేపర్‌ను రీసెర్చర్స్ రూపొందించగా, ఈ ప్రాజెక్టుకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టీ) నిధులు సమకూర్చింది.
ఆహార ప్యాకేజింగ్‌లో పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్‌ల వాడకం సంవత్సరాలుగా పెరగడంతో పర్యావరణ కాలుష్యం మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా, మిల్లులు సంవత్సరానికి 400 మిలియన్ టన్నుల కాగితాన్ని ఉత్పత్తి చేస్తుండగా, దీని వల్ల అడవుల నిర్మూలన జరుగుతోంది. ఈ సమస్యకు ‘పైన్ నీడిల్స్’ అత్యుత్తమ పరిష్కారం. ఎందుకంటే.. కలపకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోన్న పైన్ నీడిల్స్‌తో పేపర్ తయారు కావడం వల్ల కలప నష్టాన్ని భర్తీ చేయొచ్చు.