- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీఐసీఐ స్కామ్‌లో చందా కొచ్చర్‌కు బెయిల్!
దిశ, వెబ్‌డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌కు ముంబైల్ పీఎంఎల్ఏ(మనీ లాండరింగ్ కోర్టు)లో ఊరట లభించింది. ఐసీఐసీఐ, వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో చందా కొచ్చర్‌కు బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శుక్రవారం విచారణకు హాజరైన ఆమెకు రూ. 5 లక్షల పూచికత్తుతో బెయిల్‌ను ఇస్తూ, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు జనవరి 30న చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్, ఇతరులను సమన్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం బెయిల్ ఇచ్చింది. కాగా, చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంకు రుణాల స్కామ్‌లో వీడియోకాన్ గ్రూపునకు రూ. 3,250 కోట్లను మంజూరు చేసినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె భర్తపై కూడా మనీలాండరింగ్ కెసు నమోదైంది. అనంతరం 2019లో సీబీఐ కేసును నమోదు చేయగా, ఈడీ 2020లో కేసు నమోదు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో చందా కొచ్చర్ దంపతులను ఈడీ అరెస్ట్ చేసింది.