- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Champions Trophy 2025: ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీ.. ఫైనల్‌కు టీమిండియా

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సెమీ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)పై టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఆసిస్ నిర్దేశించిన 264 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో ఛేదించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసిస్ 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హెడ్(39), స్టీవ్ స్మిత్(73), లబుషేన్(29), కారీ(61) రాణించారు. కీలక బ్యాట్‌మెన్‌లు స్వల్ప స్కోరుకే పెవీలియన్ చేరడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు. ఇక భారత(India) బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు, వరుణ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, హర్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.
ఇక 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా(Team India) బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(8) నిరాశపర్చినా.. రోహిత్ శర్మ(28) పర్లేదు అనిపించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(84), శ్రేయాస్ అయ్యర్(45)లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి అనంతరం అక్షర్ పటేల్(27), కేఎల్ రాహుల్ (42), హర్దిక్ పాండ్యా(28) రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఎవరూ లైట్ తీసుకోకుండా సమిష్టి ప్రదర్శన చేశారు. మొత్తంగా 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా, కూపర్, నాథన్, బెన్ తలో వికెట్ తీశారు.