అంకిత్ శర్మ బాడీపై 400 కత్తిపోట్లు..

by  |
అంకిత్ శర్మ బాడీపై 400 కత్తిపోట్లు..
X

దిశ, ఢిల్లీ :
ఢిల్లీలో జరిగిన మారణకాండలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ అధికారి అంకిత్ శర్మ మృతదేహంపై 400ల కత్తిపోట్లు లభ్యమైనట్టు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఆయన శరీరంలోని ప్రతి భాగంలో పదునైన ఆయుధాలతో పొడిచారని వైద్యులు వెల్లడించారు. హత్యకు ముందు చాలా సేపు చిత్రహింసలకు గురిచేసినట్టు నివేదికలో పేర్కొన్నారు.ఇందులో కనీసం 6గురి హస్తమున్నట్టు వైద్యులు భావిస్తున్నారు. దాదాపు 4నుంచి 6గంటల వరకు ఈ హింసకాండ కొనసాగగా, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నసమయంలో అల్లరి మూకలు అంకిత్ శర్మపై దాడికి పాల్పడ్డారు.అనంతరం అత్యంత పాశవికంగా చంపి డ్రైనేజీలో పడవేసినట్టు సమాచారం. ఈ మారణహోమంలో అంకిత్ శర్మ కత్తిపోట్లకు గురవ్వగా, మరో కానిస్టేబుల్ మూకలు జరిపిన కాల్పుల్లో చనిపో్యాడు. మరో 50మందికి పైగా పో్లీసులు గాయాల పాలై చికిత్స పొందుతున్నారు.

Advertisement
Next Story

Most Viewed