జాన్వీ మూవీపై ఐఏఎఫ్ అభ్యంతరం

by Anukaran |   ( Updated:2020-08-13 05:50:55.0  )
జాన్వీ మూవీపై ఐఏఎఫ్ అభ్యంతరం
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రం ఆగస్టు 12న ఓటిటి(OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో(netflix) రిలీజ్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూ వచ్చినా..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది.

సినిమాలో గుంజన్ సక్సేనా క్యారెక్టర్‌ను హైలెట్ చేసేందుకు ఐఏ‌ఎఫ్‌ను నెగెటివ్‌గా చూపించినట్లు లేఖలో పేర్కొంది. ఐ‌ఏఎఫ్‌కు లింగ వివక్ష లేదని..స్త్రీ, పురుషులను సమానంగా చూస్తుందని తెలిపింది. సినిమాలోని నెగెటివ్ సీన్స్‌ను తొలగించాలని కోరింది. ముందుగా ధర్మ ప్రొడక్షన్స్ సినిమా యంగ్ ఐఏఎఫ్ ఆఫీసర్ల‌కు స్ఫూర్తినిచ్చే విధంగా తెరకెక్కిస్తామని అగ్రిమెంట్ చేసుకుందని..కానీ, అలా చేయలేదని చెప్పింది. వెంటనే సినిమాలోని అలాంటి సీన్లను తొలగించాలని కోరింది. ఇదే లేఖను ధర్మ ప్రొడక్షన్స్, నెట్ ఫ్లిక్స్‌కు(netflix) కూడా పంపింది ఐఏఎఫ్. ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలో సీన్లను తొలగించకుండా.. డిస్ క్లేమర్ యాడ్ చేసింది. కాగా, తొలి మహిళ ఐఏఎఫ్ ఆఫీసర్ గుంజన్ సక్సేనా కార్గిల్ వార్‌లో యుద్ధ మండలంలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఆమె జీవిత కథనే గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ మూవీ.. ఈ చిత్రానికి షహన్ శర్మ దర్శకత్వం వహించారు.

Advertisement

Next Story