నా పార్టీ కోసం పోటీ చేస్తా : జానారెడ్డి

by Shyam |   ( Updated:2021-02-12 08:49:00.0  )
Janareddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డి విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో తొలిసారి విద్యుత్ బకాయిలను మాఫీ చేసింది కూడా కాంగ్రెస్సే అని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు అందించడాన్ని అభినందిస్తున్నాం కానీ.. రుణమాఫీ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకాన్ని.. కల్యాణలక్ష్మిగా పేరు మార్చి కొనసాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పథకాలు బాగుంటే మెచ్చుకుంటాం.. పాలనలో లోపాలు ఉంటే తప్పక ప్రశ్నిస్తామని హెచ్చరించారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనాలు ఆలోచించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడటం సరికాదని అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానని, నా పార్టీకి నా సేవలు అవసరం కాబట్టి పోటీకి నిలబడ్డాను అని వెల్లడించారు. పదవులపై తనకు ఎన్నడూ ఆశలేదని తెలిపారు.

Advertisement

Next Story