- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధోనీ నుంచి టాస్ గెలవడం నేర్చుకోవాలి : మిథాలీ రాజ్

దిశ, స్పోర్ట్స్: కీలకమైన మ్యాచ్‌లలో టాస్ ఎలా గెలవాలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని దగ్గర నేర్చుకోవాలని భారత మహిళా జట్టు టెస్టు, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నది. వర్షం కారణంగా దాదాపు 80 ఓవర్లు రద్దు కావడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసింది. అయితే టాస్ ఓడిపోవడంతోనే బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని.. అదే టాస్ గెలిచి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని మిథాలీ అభిప్రాయపడింది.
మిథాలీ రాజ్ కెప్టెన్‌గా ఎన్నో మంచి విజయాలు సాధించినా.. టాస్ విషయంలో మాత్రం తడబడుతున్నది. టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీ మాదిరిగానే మిథాలీ కూడా టాస్‌లు గెలవడం లేదు. ఇదే విషయాన్ని మిథాలీ వద్ద ప్రస్తావించగా.. టాస్ ఓడినా మ్యాచ్‌లో పై చేయి సాధించామని అన్నారు. టాస్ నాకు కలసి రావడం లేదు. కానీ జట్టు సభ్యుల సహకారంతోనే మంచి ప్రదర్శన చేస్తున్నామని మిథాలీ చెప్పుకొచ్చింది. టాస్ ఎలా గెలవాలో మహేంద్ర సింగ్ ధోనిని చూసి నేర్చుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
- Tags
- mithali raj