- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ!
దిశ, సినిమా : తెలంగాణకు చెందిన మానస వారణాసి ‘వీఎల్‌సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020’ టైటిల్ గెలుచుకుంది. హర్యానాకు చెందిన మణిక షియోకండ్‌ను మిస్ గ్రాండ్ ఇండియాగా డిక్లేర్ చేయగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ రన్నరప్‌గా నిలిచింది. రాజస్థాన్‌కు చెందిన ‘మిస్ వరల్డ్ ఆసియా 2019’ సుమన్ రతన్ సింగ్ రావ్, మానసకు మిస్ ఇండియా కిరీటాన్ని అలంకరించగా.. వెడ్నస్ డే నైట్(ఫిబ్రవరి 10, 2021)మరో ఎమోషనల్ మూమెంట్‌కు సాక్ష్యంగా నిలిచింది. ఈ స్పెషల్ మూమెంట్స్ ఫిబ్రవరి 28న కలర్స్ టీవీలో ప్రసారం కానుండగా.. మిస్ ఇండియా 2020గా నిలిచిన మానస వారణాసి, డిసెంబర్ 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్‌లో ఇండియాను రిప్రజెంట్ చేయనుంది.
మానస వారణాసి ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మానస వారణాసి.. ఫైనాన్షియల్ ఇన్‌ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది. బుక్స్, మ్యూజిక్, యోగా మీద ఆసక్తి ఉన్న మానస.. చిన్నప్పుడు చాలా షై ఫీలవుతుండేదట. ఈ క్రమంలోనే భరతనాట్యం, సంగీతం ద్వారా తన ఎమోషన్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడం మొదలుపెట్టిందట. డ్యాన్స్, మ్యూజిక్ తనకు ఉత్సాహం, ధైర్యం గురించిన పాఠాలు నేర్పాయని చెప్పే మానస.. తన లైఫ్‌లో అమ్మ, నానమ్మ, చెల్లెలు మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ అని తెలిపింది.
నటి ప్రియాంక చోప్రా కూడా తనను చాలా ఇన్‌స్పైర్ చేసిందని చెప్పింది మానస వారణాసి. ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక గురించి మాట్లాడిన మానస.. తను ఒక ఎక్స్‌ప్లోరర్ అని, ఎప్పుడూ తన బౌండరీస్‌ను పుష్ చేసేందుకు ట్రై చేస్తుందని కొనియాడింది. అందుకే మ్యూజిక్, మూవీస్, బిజినెస్, సోషల్ వర్క్‌లో తన మార్క్ చూపించగలిగిందని చెప్పింది. పిరికి పిల్లగా ఉన్న తను బహుముఖ ప్రజ్ఞాశాలి, పవర్‌ఫుల్ ఉమెన్ ప్రియాంకను చూసే మాట్లాడటం నేర్చుకున్నానని తెలిపింది.
కాగా నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ఫాల్గుణి మరియు షేన్ పికాక్ మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్ మెంబర్స్‌గా ఉన్నారు.