- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సాంకేతిక లోపం.. మరోసారి నిలిచిపోయిన మెట్రో
by Shyam |

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: సాంకేతిక సమస్య తలెత్తడంతో హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైలు మార్గం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో మెట్రోలో ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మార్గంలో వస్తున్న మెట్రో రైలు ఆగిపోవడంతో.. ఆ లైన్‌లో సుమారు 20 నిమిషాల పాటు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. వెంటనే మెట్రో సిబ్బంది మరమ్మత్తులు చేపట్టి మెట్రో రైళ్లను పునరుద్ధరించారు. గతంలో కూడా పలుసార్లు ఇలాగే మెట్రో రైలు నిలిచిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.
Next Story