- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో హైదరాబాద్ వాసి హత్య
దిశ, వెబ్‌డెస్క్ :
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహ్మద్ ఆరిఫ్ మోహియుద్దీన్ అనే వ్యక్తి గత పదేళ్లుగా జార్జియాలో నివాసముంటున్నాడు. అక్కడ స్థానికంగా కిరాణం షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి వద్దకు వచ్చిన కొందరు దుండగులు దాడి చేశారు. అనంతరం కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన అరిఫ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఆరిఫ్ భార్య మోహ్నాజ్ ఫాతిమా, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
యూఎస్‌లో తమకెవరూ బంధువులు లేరని, అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఫాతిమా ప్రభుత్వాన్ని కోరారు. అక్కడ తన భర్త అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తన భర్తతో మాట్లాడానని.. అరగంట తర్వాత మళ్లీ చేస్తానని చెప్పినట్లు ఫాతిమా తెలిపారు. కానీ అతని నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని.. కొంత సమయానికి తన భర్తను ఎవరో పొడిచి చంపినట్లు బావ ద్వారా తెలిసిందన్నారు. కాగా, తెలంగాణకు చెందిన పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఏంబీటీ) ప్రతినిధి ఉల్లా ఖాన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తోపాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఫాతిమాను అమెరికా పంపించాలని కోరుతూ లేఖ రాశారు.