- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hyderabad Additional Collector : ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన
Hyderabad Additional Collector : ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన

X
దిశ , హైదరాబాద్ బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కదిరి వన్ పి అన్నారు.కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు . అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన 172 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటికి వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులలో గృహ నిర్మాణ శాఖకు 129, పింఛన్లు 15, భూ సమస్యలు 07, ఇతరములు 21 వచ్చినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో లా ఆఫీసర్ వీర బ్రహ్మ చారి జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story