- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానసిక ఉల్లాసానికే క్రీడలు : ఎమ్మెల్యే ఒడితెల
దిశ, చిగురుమామిడి : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలకేంద్రంలోని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన చిగురుమామిడి ప్రీమియర్ లీగ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడాకారులు ఎటువంటి అవాంతరాలకు లోను కాకుండా క్రీడాస్ఫూర్తితో ఆటను ఆస్వాదించాలన్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఉందన్నారు. అనంతరం ఎస్సై దాస సుధాకర్, ఎంపీపీ కొత్త వినీత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి బౌలింగ్ చేయగా.. ఎమ్మెల్యే సతీష్ కుమార్ బ్యాటింగ్ చేశారు.
అనంతరం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో 13 గ్రామాలకు చెందిన 52 మందికి 14 లక్షల77 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, రూ.45 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధిక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు చిగురుమామిడి మండలంలో 11,042 మందికి 19 కోట్ల 35 లక్షల 596 రూపాయలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, కొత్త వినీత, తహశీల్దార్ సయ్యద్ ముబిన్ అహ్మద్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ప్యాక్స్ చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.