- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాతిపెట్టిన శవాన్ని అర్ధరాత్రి బయటకు తీసిన జంట..
దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు మానవత్వం మంట కలుస్తోంది. జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. చివరికి చనిపోయిన వారిపై కూడా కనికరం చూపించడం లేదు. ఆరడుగుల జాగ కోసం పాతిపెట్టిన మృతదేహాన్ని అర్ధరాత్రి అమానుషంగా తీసి బయటపడేశారు ఓ దంపతుల జంట. నల్లగొండ జిల్లాలో జరిగిందీ దారుణ ఘటన.
జిల్లాలోని కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన బుచ్చమ్మ(60) శుక్రవారం చనిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఖననం చేశారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ జంట.. రాత్రి సమయంలో వెళ్లి పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి బయటపడేశారు. శవ పేటికను గ్రామంలోని నడిరోడ్డుపై పడేశారు. అయితే తన పాలోళ్ల (వంశస్తులు) సమాధుల కోసం ఖాళీగా ఉంచిన భూమిలో బుచ్చమ్మను పాతిపెట్టారని, అందుకే తీసేశామని ఆ దంపతులు పేర్కొనడం గమనార్హం.
అయితే ఉదయం నుంచి దహన సంస్కారాల ఏర్పాట్లు, బొంద తవ్వడాలు చేస్తున్నా పట్టించుకోని ఆ దంపతులు రాత్రి వేళ మృతదేహాన్ని వెలికితీయడం వివాదంగా మారింది. ముందే అభ్యంతరం చెబితే తాము వేరే చోట ఖననం చేసే వాళ్లమని, పాతిపెట్టిన తర్వాత తీసేయడం ఏంటని మృతురాలి బంధువులు మండిపడుతున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించి, తమకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.