నా భార్య అలా చేయమంటుంది.. పోలీస్ స్టేషన్ని ఆశ్రయించిన భర్త

by Sumithra |
నా భార్య అలా చేయమంటుంది.. పోలీస్ స్టేషన్ని ఆశ్రయించిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్ : భర్తలు భార్యల్ని వేధించడం సహజం కానీ, ఓ భర్త తనను తమ భార్య వేధిస్తోందని సైబరాబాద్‌ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించాడు. ఈఘటన సైబరాబాద్‌లో చోటు చేసుకుంది. పెళ్లైనాక భార్య భర్తల మధ్య గొడవలు సహజం. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు పెద్దగా మారి విడాకులకు కూడా దారితీస్తాయి. అయితే ఇలానే ఎంతో ఇష్టంగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని పెళ్లి చేసుకున్న యువతి చివరకు వీడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది.

వివరాల్లోకి వెళ్లితే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిన పెళ్లి చేసుకుంది ఓ యువతి. కొన్ని నెలలు వీరి కాపురం.. ఎంతో అన్యోన్యంగా సాగింది. అలానే అంత బాగుంది అనుకునే సరికి భర్త రోజు తాగడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా మద్యానికి బానిసై భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో విసిగిపోయిన భార్య, అతడితో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత పెద్ద మనుషులు వీరు కలిసి ఉండటానికి ఎంత ప్రయత్నించినా భార్య, భర్తలిద్దరూ ఒప్పుకోకపోవడంతో కొన్ని నెలల నుంచి పుట్టింటిలోనే ఉంటుది.

ఆ తర్వాత తప్పు తెలుసుకున్న భర్త తన భార్య వద్దకు వెళ్లి ఇంటికి రమ్మని బతిమిలాడిన భార్య ఒప్పుకోలేదు, అంతేకాకుండా విడాకులు ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో మనోవేధనకు గురైన భర్త రోజు మద్యం సేవించి భార్య ఇంటికి వెళ్లి రమ్మని కోరడం మళ్లి ఇంటికి రావడం చేశాడు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయే సరికి విసిగి పోయి చివరికి నా భార్య విడాకులు ఇవ్వమంటూ ఏడాది కాలంగా వేధిస్తోందని సైబరాబాద్‌ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించాడు. కానీ అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. భార్య భర్తలిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులకు భార్య షాకిచ్చింది. నేను నా భర్తతో వెళ్లను, తాను ఎప్పటికీ మారడు ఇకపై తనను కౌన్సిలింగ్‌కు పిలవవద్దని గట్టిగా హెచ్చరించింది. దాంతో పోలీసులు కూడా సైలెంట్‌గా ఉన్నారు. కానీ భర్త మాత్ర ఫిర్యాదులు చేయడం ఆపలేదు. అయితే పోలీసులు మాత్రం ఈ ఒక సంఘటనే కాదు ఇలా చాలా మంది భర్తలు సైబరాబాద్ భరోసా కేంద్రానికి ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed