- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్ పల్లిలో దారుణం.. పసిపాప తల్లిని హత్య చేసిన భర్త
దిశ, మెట్ పల్లి: కడవరకు కలిసి ఉంటానని ప్రమాణం చేసిన చేతులతోనే వరకట్నం కోసం కట్టుకున్న భార్యను కడ తేర్చిన ఘటన మంగళవారం మెట్ పల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెట్ పల్లి పట్టణం బోయవాడకు చెందిన వాల్గోట్ కిషోర్(32) బండలింగాపూర్ గ్రామానికి చెందిన హన్విత అలియాస్ (నిషిత) ప్రేమించుకొని పెద్దల సమక్షంలో 2018 మార్చి 8న పెళ్లి చేసుకున్నారు, పెండ్లి సమయంలో మృతురాలి తల్లిదండ్రులు కిషోర్ కి వరకట్నంగా రూ. లక్షలు ఒప్పుకొని పెండ్లిలో రూ. లక్ష మాత్రమే ఇచ్చి ఇతర పెళ్లి లాంఛనాలు, సామాగ్రి అందజేశారు. కొన్ని రోజులకు కిషోర్ తన భార్యను పెండ్లి సమయంలో ఇస్తానన్న మిగతా రూ. లక్ష తీసుకురమ్మని నిత్యం కొట్టి వేధించేవాడు. వీరికి ఓ పాప జన్మించింది. తర్వాత కూడా కిషోర్, మృతురాలిని అదనపు కట్నం తేవాలాంటూ వేధింపులకు గురి చేసేవాడు. మంగళవారం మృతురాలిని మరోసారి వేధింపులకు గురిచేసి హత్య చేశాడు. అనంతరం మృతురాలే ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడని మెట్ పల్లి ఎస్ఐ సధాకర్ తెలిపారు.