- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి మహిళను నగ్నంగా మార్చి.. ఒళ్లంతా బుడిద పూసి..
దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు సైన్స్ అభివృద్ధి చెందుతున్నా.. కొందరు ఇంకా అనాగరికంగా ఆలోచిస్తున్నారు. మూఢ నమ్మకాలు, అతి విశ్వాసాలకు మరొకరిని బలి చేస్తున్నారు. మగ సంతానం కలగాలని భర్త, అత్త కలిసి ఓ మహిళను చిత్రహింసలకు గురి చేస్తూ అమానుషంగా ప్రవర్తించారు. భార్యను నగ్నంగా మార్చి.. ఒళ్లంతా బుడిద పూస్తూ పరాయి వ్యక్తి ముందు పరువు తీసేలా వ్యవహరించారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూణె జిల్లా ఖేడ్ తహసిల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కోడలికి మగ సంతానం కలగాలని దారుణానికి పాల్పడింది. వారసుడు పుట్టాలని భూత వైద్యుడిని సంప్రదించారు. అతడు పూజలు చేసి బుడిద ఇచ్చాడు. దానిని కోడలికి తినిపించడంతోపాటు ఒంటికి రాయాలని పురమాయించాడు. వెంటనే కోడలిని భూత వైద్యుడి ముందుకు తీసుకువచ్చిన భర్త, అత్త ఆమెను వివస్త్రన చేసి బుడిద, పసుపు, కుంకుమ రాశారు. అనంతరం బుడిదను తినిపించే ప్రయత్నం చేయగా.. కోడలు ప్రతి ఘటించి బయట పడింది. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
పింప్రి చెంచ్వాడాలోని చకాన్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం కోడలి వాంగ్మూలం నమోదు చేశారు. భర్తతోపాటు అత్తపై ఆమె ఫిర్యాదు చేసింది. మగ సంతానం కోసం నాలుగేళ్లుగా తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాపోయింది. అర్ధరాత్రి భూత వైద్యుడిని పిలిపించి అతడి ముందే నగ్నంగా మార్చి బుడిద, పసుపు, కుంకమ ఒంటికి రాశారని తెలిపింది. మగ బిడ్డను కనకుంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని బెదిరిస్తూ తనను చిత్రహింసలకు గురి చేశారని తెలిపింది. ఇదే విషయంపై చాలాసార్లు గొడవలు జరిగిన తాను పుట్టింటికి వెళ్లానని, అదే సమయంలో అదనపు కట్నం కోసం కూడా ఇబ్బందులకు గురి చేశారని పోలీసుల ముందు తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె ఫిర్యాదుతో భర్త, అత్తపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.