- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను కొట్టి స్నేహితుడితో రేప్ చేయించిన భర్త
దిశ, వెబ్‌డెస్క్: దంపతుల మధ్య గొడవలు దారుణానికి ఒడిగట్టాయి. భార్య మీద కోపంతో స్నేహితులతో దాడి చేయించి.. ఆ తర్వాత రేప్ చేయించాడో భర్త. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో సంచలనం రేపుతోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు వివరాల్లోకి వెళితే.. యూపీలోని అమేథి జిల్లా బజార్‌శుక్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత నివాసం ఉంటుంది. భర్తతో గొడవల కారణంగా కోర్టులో కేసు నడుస్తోంది. తనపై కేసు పెట్టిందని కోపం పెంచుకున్న భర్త శ్రవణ్ ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశాడు.
ఈ నేపథ్యంలోనే ఆగస్టు 24వ తేదీన అతడి స్నేహితులను (ముగ్గురిని) భార్య ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. ఇదే సమయంలో బాధితురాలు ఒంటరిగా ఉండడంతో దాడి చేశారు. ఆ తర్వాత భర్త సపోర్ట్ చేయగా అతడి స్నేహితుడు తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని.. నరకం చూపించారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగక తనపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కోసం వెళ్తే పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే అమేథి సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయగా.. విచారణకు ఆదేశాలిచ్చారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు దర్యాప్తులో ఉంది.