- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్యపై అనుమానంతో అందరి ముందే కత్తితో..
దిశ, కోదాడ : భార్యపై అనుమానంతో వేధించిన భర్త.. చివరికి ఆమెపై హత్యయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో తలపై వేటు వేశాడు. స్థానికుల అప్రమత్తతతో ఆమె ప్రాణాలు నిలిచాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడకు చెందిన బజ్జురి అనిల్ కమార్‌కు పదేళ్ల క్రితం చిలుకూరు మండలం కట్టకొమ్మగూడెం గ్రామానికి చెందిన శ్రీలతతో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయవాడలోనే పెయింటర్‌గా పని చేసే అనిల్ కుమార్ కొన్నాళ్లుగా భార్యను అనుమానిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త టార్చర్ భరించలేక శ్రీలత తల్లిగారి ఊరైన కట్టకొమ్ముగూడెం వచ్చింది.
శుక్రవారం భార్య కోసం వచ్చిన అనిల్ కుమార్ ఆమెపై అనుమానంతో కత్తి తీసుకుని దాడి చేశాడు. ఆమె తలపై, ఇతర ప్రాంతాల్లో వేట్లు వేశాడు. శ్రీలత అరుపులకు అప్రమత్తమైన గ్రామస్తులు అనిల్ కుమార్‌ను బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయపడిన శ్రీలతను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనై పోలీస్ స్టేషన్లో ఇంతవరకు ఫిర్యాదు అందలేదు.
ఇది కూడా చదవండి..