- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సుతో ఎఫైర్ నడిపిస్తున్న భర్త.. విషయం భార్యకు తెలియడంతో..
దిశ, వెబ్‌డెస్క్ : వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నాయి. కొన్ని నిమిషాల సుఖం కోసం.. కొందరు పురుషులు, మహిళలు వారి కుటుంబాలను రోడ్డు మీదకు తెస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ డాక్టర్ తన భార్యను దారుణంగా చంపేందేకు ప్రయత్నించాడు. తీరా పోలీసుల రాకతో కటకటాలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని నలందా ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. వారిద్దరికీ 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వివాహం తర్వాత వైద్య వృత్తిలో స్థిరపడిన ఆ భర్త తన దగ్గర పనిచేసే నర్సుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో.. తన భార్యను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో భార్యతో మాట్లాడి విడాకులు ఇవ్వాలని కోరాడు. ఇది విన్న సదరు మహిళ ఒక్కసారిగా షాక్ అయింది.
విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. భార్య సమాధానంతో కంగుతున్న భర్త మరో ప్లాన్ రచించాడు. భార్య పరువు తీయాలని భావించాడు. ఇందుకోసం తన స్నేహితుడి సాయం కూడా తీసుకున్నాడు. తన స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చి.. భార్యను అతడితో సరసాలాడమంటూ ఒత్తిడి చేశాడు. ఈ పని చేయడానికి సదరు మహిళ నిరాకరించింది.
ఇది కరెక్ట్ కాదని ఎంతో వారించింది. ఈ క్రమంలో భార్య తీరుకు ఆగ్రహానకిలోనైన భర్త.. ఆమెపై దాడి చేశాడు. బ్లేడుతో ఆమె గొంతు, చేతులపై కోసేశాడు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ విషయం గమనించిన స్థానికులు సదరు మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు మహిళ స్టేట్‌మెంట్ తీసుకొని కేసు నమోదు చేశారు. ఆమె భర్తను, స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు.