- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భర్త నాతో సెక్స్ చేయడం లేదు.. బెడ్ రూమ్‌లో ఒంటరిగా వదిలేసి..
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో ఆశలతో అత్తారింటో అడుగుపెట్టిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. తన భర్త చేసిన పనికి షాక్‌లో వెళ్లిపోయింది. 23 ఏళ్ల మహిళ తనకు పెళ్లి జరిగినప్పటి నుంచి తనతో భర్త సెక్స్ చేయడం లేదని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. సెక్స్ గురించి ప్రస్తావిస్తే.. తనను చాలా దారుణంగా కొడుతున్నాడని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణ ఘటన గుజురాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని చోటుచేసుకుంది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 27వ తేదీన బాధితురాలికి.. కుటుంబ సభ్యులు 25 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారని మహిళ తెలిపింది. పెళ్లి జరిగిన 10 రోజులకు భర్త తనతో శృంగారంలో పాల్గొన్నాడని.. ఆ తర్వాత మళ్లీ అతడు తనతో కలవలేదని చెప్పింది.
‘నా భర్త నాతో సెక్స్ చేయడం మానేశాడు. మేమిద్దరం బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు వింతగా ప్రవర్తించేవాడు. నేను సెక్స్ గురించి ప్రస్తావిస్తే.. దారుణంగా కొట్టేవాడు. నన్ను బెడ్ రూమ్‌లో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయేవాడు’ అని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. సెక్స్ విషయంపై భర్తను ప్రశ్నించగా.. తను అందంగా లేకపోవడం వల్లే శారీరకంగా కలవడంలేదని చెప్పినట్టు తెలిపింది. అతడు మరో మహిళతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నట్టుగా చెప్పింది.
ఈ క్రమంలోనే కోపంతో ఆగస్టు 1న ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు, అత్తింటివారు ఆమెను తిరిగి భర్త వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా ఎలాంటి వేధింపులు ఉండవని అత్తింటివారు ఆమెకు హామీ ఇచ్చారు. కానీ, భర్త వద్దకు చేరిన ఆమెకు మళ్లీ అవే పరిస్థితులు ఎదురయ్యాయి. తనను హింసించడమే కాకుండా, పట్టించుకోవడం మానేశారు. అంతేకాకుండా ఆగస్టు 7వ తేదీన తనను తల్లిదండ్రుల ఇంట్లో వదిలేశాడు. ఈ క్రమంలోనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తమామలపై గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది.