- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమానం పెనుభూతంలా మారి..భార్యను చంపిన భర్త
దిశ, నిజామాబాద్: కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానం పెనుభూతంలా మారింది. నిజానిజాలు తెలుసుకునే స్థితిలో ఆ వ్యక్తి లేడు.ఈ క్రమంలోనే దంపతులిద్దరి మధ్య గొడవ జరిగడంతో కోపోద్రిక్తుడైన భర్త తెల్లవారుజామున భార్య గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో పిట్లం మండలం గుడి తండాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..గుడితండాకు చెందిన శిరిష(23), పిట్లం మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత చారిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైద్రాబాద్‌లోని శంషాబాద్ మామిడిపల్లిలో దంపతులు నివాసముండేవారు. అయితే శిరిషకు అంతకు మందే వివాహం జరిగి విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. శిరిష తల్లిదండ్రులు పదేండ్ల కిందటే మరణించగా, లాక్‌డౌన్ సమయంలో ఆమె గుడితండాకు వచ్చింది. అనంతరం బుధవారం హైద్రాబాద్ కు వెళ్లి భర్తను కలిసింది. అదే రోజు సాయంకాలం శ్రీకాంత చారి తన భార్యను పిట్లం మండల కేంద్రానికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి వారిద్దరి మధ్య మళ్లీ గొడవ తలెత్తింది. అనంతరం తెల్లవారు జామున శిరిష గొంతునులిమి హత్య చేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దామోదర్ రెడ్డి తెలిపారు.