భార్య, కూతుర్ని నరికి చంపిన భర్త

by Sridhar Babu |
భార్య, కూతుర్ని నరికి చంపిన భర్త
X

దిశ, హుజురాబాద్: తాళి కట్టిన ఆలిని, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడో కసాయి భర్త. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. వివరాళ్లోకి వెళితే… పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గతకొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు తీవ్రతరం అయ్యాయి. తీవ్ర మనస్థాపం చెందిన వెంకటేశ్వర్లు భార్య రమాదేవి(45), కూతురు ఆమని(25)ని అర్థరాత్రి గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed