- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నీళ్లిచ్చినందుకు… పొడిచి చంపిండు

దిశ, కుత్బుల్లాపూర్: భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో భార్య ప్రియుడిని భర్త హత్య చేశారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన కృష్ణ, పోచమ్మ దంపతులు బతుకుదెరువు కోసం కుత్బుల్లాపూర్‌లోని భాగ్యలక్ష్మి కాలనీకి వలస వచ్చారు.
ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. నాటి నుంచి పోచమ్మ అదే కాలనీలోని తల్లి గారింటి వద్ద ఉంటుంది. అయితే ఇటీవల పోచమ్మ సొంతూరు సమీప గ్రామానికి చెందిన మాధవరావుతో చనువుగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వ్యవహారం నడుపుతున్నారని అనుమానించాడు.
ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి మాధవరావు (35) లలిత వద్దకు వచ్చాడని తెలుసుకున్న కృష్ణ అక్కడికి చేరుకున్నాడు. తాను చూస్తుండగానే మాధవరావుకు నీళ్లివ్వడం జీర్ణించుకోలేక కృష్ణ కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.