ఆ వీడియోల్లో యాక్ట్ చేసిన ప్రియురాలు.. ప్రియుడుకు విషయం తెలిసి..

by Sumithra |   ( Updated:2021-06-10 08:07:29.0  )
husband kerosene attack on wife in kerala
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ బంధం నిలబడాలన్నా దానికి నమ్మకం ఉండాలి.. ముఖ్యంగా భార్య భర్తల మధ్య నమ్మకం ఉంటేనే వారి బంధం గట్టిపడుతుంది. కానీ ఇప్పుడున్న జంటల్లో ఒకరిపై ఒకరికి అనుమానం తప్ప నమ్మకం అనేది ఇసుమంతైనా ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ అనుమానమే పెనుభూతంగా మారి వారి ప్రాణాలను హరించి వేస్తోంది. తాజాగా తనతో పాటు సహజీవనం చేస్తున్న భాగస్వామిని అనుమానంతో కిరోసిన్ పోసి నిప్పటించాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

కేరళలోని అంచల్ ప్రాంతంలో అతిరా, షాన్‌వాస్ అనే జంట గత రెండేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరికి మూడు నెలల శిశువు కూడా ఉన్నారు. అయితే అప్పటికే అతిరా, షాన్‌వాస్‌లకు విడివిడిగా పెళ్లిళ్లు అయ్యాయి. వారితో తమ వివాహ బంధాన్ని తెంచుకొని వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అతిరా టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియోల ద్వారా ఆమె కొంతమంది యువకులతో క్లోజ్ గా ఉండడం షాన్‌వాస్ కి నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా అతిరా వినలేదు. దీంతో కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య వాగ్వాదం నడుస్తోంది. దీంతో అతిరా పై అనుమానం పెంచుకున్న షాన్‌వాస్ ఆమెను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు.

ఈ విషయంపై ఇటీవల ఆమెతో గొడవ పెట్టుకొన్న అతను కోపోద్రేకుడై ఇంట్లో ఉన్న కిరోసిన్ ని ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటల్లో కాలిపోతున్న ఆమెను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతున్న అతిరా వైద్యులకు చివరి నిమిషంలో షాన్‌వాస్ యే తనపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని తెలిపి మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు,

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story