- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. వినాయకచవితి రోజు ఆ ఇంట్లో రెండు శవాలు
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపి ఆపై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మల్యాల సీఐ రమణ మూర్తి, కొడిమ్యాల ఎస్‌ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బత్తిని దేవయ్య, ప్రమీల భార్యభర్తలు. దేవయ్య దుబాయ్ వెళ్లి సంవత్సరం క్రితం ఇంటికి రాగా అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకుంటూ తరచుగా వేధిస్తూ ఇంట్లో పలుమార్లు గొడవలు చేస్తున్నాడు. ఈ అనుమానాలతోనే గురువారం రాత్రి దేవయ్య తన భార్య ప్రమీల తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్త స్రావమై ప్రమీల అక్కడికక్కడే మృతిచెందింది. తరువాత భర్త దేవయ్య కూడా ఉరేసుకుని మరణించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.