- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
45 రోజులకే భార్య వద్దంటూ భర్త సూసైడ్

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం గాంధీ నగర్ లో ఓ ఇంట్లో సచివాలయ ఉద్యోగి నాగరాజు(30) ఉరి వేసుకొని మృతి చెందాడు. నాగరాజు ఆదోని మండలం నారాయణపురం లో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మల్కాపురం గ్రామానికి చెందిన నాగరాజు… కడిమెట్ల గ్రామంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న కేశవ లక్ష్మీ(27)ని 45 రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు.
అయితే వీరి మధ్యలో అనుమానం పెనుభూతంగా మారడంతో విడిపోయారు. శనివారం పెద్దల సమక్షంలో ఇరువురికీ రాజీ చేశారు. ఆదివారం భార్యను ఇంటికి తీసుకెళ్లాలంటూ నాగరాజును పెద్దలు ఆదేశించారు. భార్యతో కాపురం చేయడానికి ఇష్టం లేక ఇంట్లో ఉరి వేసుకొని నాగరాజు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also…
Next Story