ముచ్చటగా మూడు.. అప్పటిదాకా వాడు!

by vinod kumar |   ( Updated:2020-06-03 04:55:11.0  )
ముచ్చటగా మూడు.. అప్పటిదాకా వాడు!
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వైరస్‌ను నిరోధించేందుకు సామాజిక దూరం పాటించడంతోపాటు విధిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికీ చాలామంది సీరియస్‌గా తీసుకోవడం లేదు. భారత్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నాటి నుంచి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా ఇండియాలో రోజువారీ కేసులు దాదాపు 8 వేలుగా నమోదవుతున్న తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం 2 మీటర్ల సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయడం, మాస్క్‌ ధరించడం వంటి చర్యలు కరోనా బారి నుంచి మనల్ని కాపాడతాయని లాన్సెట్‌ మెడికల్ జర్నల్‌‌లో ఓ నివేదిక పబ్లిష్ అయ్యింది. ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ మాస్క్, డిస్టెన్సింగ్, ఐ ప్రొటెక్షన్ ఇలా పలు అంశాలపై 16 దేశాల్లో దాదాపు 172 అధ్యయనాలను సమీక్షించి పరిశోధకులు ఈ నివేదికను వెల్లడించారు. ఈ అధ్యయనంలో కెనడా, యూఎస్, చైనా, యూకే వంటి దేశాల యూనివర్సిటీలు, హస్పిటల్స్‌ లో పనిచేసే పరిశోధకులు పాల్గొన్నారు.

సమూహాల్లో తిరిగినా, ఇంట్లో ఉన్నా.. కరోనాను కట్టడి చేయాలంటే కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పరిశోధకులు నివేదికలో వెల్లడించారు. ‘ఏ ఇన్వెన్షన్ అయినా 100 శాతం ఎఫెక్టివ్‌గా ఉండదు. కానీ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ యూజ్, క్లీనింగ్ హ్యాండ్స్ .. ఈ మూడు కలిసి పాటించడం వల్ల కొవిడ్ -19ను చాలా వరకు నిరోధించవచ్చు. వ్యాక్సిన్ డెవలప్ అయ్యే వరకు వీటిని మించిన ఆయుధాలు మరేం లేవు’ అని సిడ్నీలోని కిర్బీ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ మ్యాక్లిన్ టైర్ పేర్కొన్నారు. వ్యాధి సోకినవారి నుంచి మీటరు దూరం(3.3 ఫీట్) లోపల ఉన్న వ్యక్తికి వైరస్‌ సోకే అవకాశం 12.8 శాతంగా ఉండగా, ఒక మీటరు కన్నా ఎక్కవ దూరంలో ఉంటే 2.6 శాతం, 2 మీటర్ల దూరం (6.6 ఫీట్)లో ఉన్నప్పుడు వ్యాప్తి ఒక్క శాతానికి తక్కువగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. అంతేకాదు మాస్క్ ఏది వాడినా పర్లేదు కానీ.. ఎక్కువ పొరలు ఉన్న మాస్క్‌ ధరించడం మరింత శ్రేయస్కరం అని పేర్కొంది.

ఫేస్ మాస్క్, ఐ ప్రొటెక్షన్:

ఫేస్ మాస్క్ ధరించిన వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 3.1 శాతం ఉండగా.. ధరించని వారికి 17.4 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఫేస్ షీల్డ్ పెట్టుకోకపోవడం వల్ల 16శాతం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండగా, ధరించిన వారికి 5.5 శాతంగా ఉంది. ఇవి 100 శాతం వాస్తవమని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు.

Advertisement

Next Story