- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక అక్కడ హాట్‌స్టార్ లేనట్లే… మరి న్యూ సబ్‌స్క్రిప్షన్ మాటేంటి?
దిశ, సినిమా: డిస్నీ + హాట్‌స్టార్ ఇండియాలో నెక్స్ట్ ఫేజ్ జర్నీ స్టార్ట్ చేసింది. లేటెస్ట్‌గా న్యూ సబ్‌స్క్రిప్షన్స్ ప్లాన్స్ కూడా అందుబాటులోకి రాగా.. అమెరికాలో మాత్రం త్వరలో పూర్తిగా కనుమరుగై పోనుందని తెలుస్తోంది. మంగళవారం ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌లో హాట్‌స్టార్ ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది. కాగా డిస్నీ మరియు ఫాక్స్ సంస్థలు స్టాండ్ఎలోన్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న హాట్‌స్టార్‌ను 2009లో స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇండియా, ఇండోనేషియా, మలేసియా, థాయిలాండ్, సింగపూర్‌లో డిస్నీ+హాట్‌స్టార్‌గా ఆపరేట్ అవుతుంటే.. కెనడా, యూకే, యూఎస్‌లో మాత్రం హాట్‌స్టార్ సెపరేట్‌గా ఆపరేట్ అవుతుంది. అయితే హాట్‌స్టార్ బ్రాండ్‌ను పూర్తిగా డిస్నీ నుంచి తొలగించేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో హాట్ స్టార్ స్పెషల్స్ ‘ది ఎంపైర్, ఆర్య, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ లాంటి షోస్‌తో కలిపి ఇండియన్ కంటెంట్ మొత్తం ‘హులు’కు షిఫ్ట్ కానుండగా.. క్రికెట్‌తో కలిసి అన్ని స్పోర్ట్స్ రైట్స్ ESPN+కు షిఫ్ట్ కానున్నాయి.