- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జియో టీవీతో హాట్ స్టార్ కటీఫ్

దిశ, స్పోర్ట్స్: మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభం కానుండగా, హాట్ స్టార్ (Hotstar) ద్వారా లైవ్ మ్యాచ్(Live match)లను చూసే అవకాశాన్ని జియో టీవీ వినియోగదారులు (Jio TV users) కోల్పోనున్నారు. ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ హాట్‌స్టార్ (IPL Streaming Partner Hotstar)తో భాగస్వామ్య ఒప్పందం ముగిసిపోవడంతో జియో టీవీ కస్టమర్లు లైవ్ మ్యాచ్‌లను చూసే అవకాశం కోల్పోయారు.
ఈ రెండు డిజిటల్ సంస్థల (digital companies) మధ్య భాగస్వామ్య కాలపరిమితి ఈ ఏడాది మొదట్లో ముగిసింది. అప్పట్నుంచీ చర్చలు జరుగుతున్నా ఇంతవరకు వీరి మధ్య అవగాహన కుదరక పోవడంతో హాట్‌స్టార్ (Hotstar) తమ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఐపీఎల్ 2018 సీజన్ తర్వాత హాట్‌స్టార్ ద్వారా లైవ్ మ్యాచ్‌లు చూసే వారి సంఖ్య 74శాతం పెరిగింది.
గతేడాది ఫైనల్ మ్యాచ్ (Final match) రికార్డు స్థాయిలో 18.6 మిలియన్ల మంది వీక్షించారు. ఇంతమంది సబ్‌స్క్రైబర్లు (Subscribers) వీక్షించడానికి జియో టీవీనే కారణం. హట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (Subscription) లేకుండా 5నిమిషాల వరకు మాత్రమే ఉచితంగా చూసే వీలుంటుంది. కానీ, జియో టీవీలో ఎంత సేపైనా వీక్షించవచ్చు. అయితే, ప్రస్తుతం ఒప్పందం ముగిసిపోవడంతో హాట్‌స్టార్ (Hotstar)కు కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.