Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు

by Disha Tech |   ( Updated:2023-05-07 01:45:53.0  )
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు
X

మేష రాశి : ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీ మనస్సు మీ ఆధీనంలో ఉంచుకోండి.మీరు ఈ రోజు మీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి.. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి : మీకున్న ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టకండి . మీ కోసం మీరు సమయాన్ని కేటాయించండి. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోవాలి. మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. కానీ ప్రతిది మీకు నచ్చి నట్టు జరగదు.మీ చుట్టాలందరికి దూరంగా ఉంటారు. ఈరోజు ప్రశాంతవంతమైన ప్రదేశానికి వెళతారు. మీ వైవాహిక జీవితంలో కెల్లా గొప్ప రోజుల్లో ఒకటిగా అవ్వనుంది.

మిథున రాశి : అనవసరపు ఖర్చులు చేయకండి . మీకుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మీకు చిరాకు వస్తుంది. కానీ మీరు ప్రశాంతంగా ఉండండి. ఆర్ధిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారికీ మీ ప్రేమను పంచండి. ఈ రోజు మీరు కొన్ని అశుభవార్తలు వినాలిసి ఉంటుంది. . ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచం జాగ్రత్త అవసరం. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి : మీరు పని చేసే ఆఫీసులో మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల మీకు ప్రశాంతత ఉండదు. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది. ఇవాళ మీ కోసం ఇచ్చే బహుమతులతో పాటు కొంతసమీ కోసం మీ జీవిత భాగస్వామి ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ మీ ఈ రోజు ప్రారంభం కలిసిరాదు.. కానీ సాయంత్ర సమయానికి మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.

సింహ రాశి : మీ ఆరోగ్య సమస్యల వల్ల మీరు చేయాలనుకున్న పనులను చెయ్యలేరు. మీ ఇంటికి అతిదులు రావడం వలన మీ పనులను వాయిదా పడతాయి. ఈ రోజు పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొంత సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో గొడవ పడవచ్చు. కాబట్టి ఆమెకు నచ్చినట్టుగా ఉండండి. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది.

కన్యా రాశి : అతిగా ఖర్చులు పెట్టకండి. మీకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు అది గుర్తు పెట్టుకోండి. మీరు, మీ సమయాన్ని మీ ఇంట్లో వారికీ కేటాయించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక స్పెషల్ చేస్తారు. మీ యొక్క పనులు పూర్తికాకూండా మీరు కొత్త పనుల గురించి ఆలోచించకండి . ఇది మీరు పాటించకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి.

తులా రాశి : మీ పాత స్నేహితులను కలుసుకొని వారి నుంచి కొంత డబ్బునుఅప్పుగా తీసుకుంటారు. మానసికంగా మీరు పడుతున్న బాధలు తగ్గుతాయి. పని ఒత్తిడిని తగ్గించడానికి రోజు మీరు యోగా, వ్యాయామం చేయాలిసి ఉంటుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు అందమైన బహుమతిని ఇస్తారు.

వృశ్చిక రాశి : ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. అలాగే సాయంత్రానికి మీ మూడ్ మారిపోతుంది.మీ ప్రేమ మీకు ఒక విలువైన వస్తువుగా మారనుంది. ఆఫీసులో మీకు నచ్చని పనులు జరుగుతాయి. అది చూసి మీకు చాలా కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.మీ వైవాహిక జీవితం మీ చేతిలో ఉండదు.

ధనస్సు రాశి : మీరు కన్న కలలు నిజమౌతాయి. డబ్బు ఉందని పొగరుగా ఉండకండి. మీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.నేడు మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. ఈ రోజు మీరు కొన్ని పనులు వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు . ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కోపాన్ని తెప్పిస్తుంది.

మకర రాశి : మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. మీ పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ రోజు మీకు మంచి ఆలోచలనలు వస్తాయి. మీ వస్తువులను భద్రంగా దాచుకోవాలి. మీ వైవాహిక జీవితంలో మీరు అనుకోని విధంగా మార్పులు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి : ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఇప్పటి నుంచి ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఈ రోజు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు . మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కొత్త చిక్కులు వస్తాయి.

మీన రాశి : ఈ రోజు మీరు అనుకున్న కల నెరవేరబోతోంది.మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సమస్యల గురించి చర్చిస్తారు. మీ పని చేసిన దానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవితం భాగస్వామితో మీ బాధలను పంచుకుంటారు. మీ వైవాహిక జీవితం అందంగా మారబోతుంది.


ఇవి కూడా చదవండి:

Telugu Panchangam 07 మే : నేడు శుభ, అశుభ సమయాలివే!

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed