హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు

by Harish |
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల కారణంగా దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. కరోనా మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రియల్ రంగంలో డిమాండ్ పునరుద్ధరించేందుకు తీసుకున్న చర్యలతో కొనుగోలుదారుల సెంటిమెంట్ బలపడిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాప్‌టైగర్ తెలిపింది. ముఖ్యంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికం ఇళ్ల అమ్మకాల్లో 12 శాతం వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. 2021 క్యాలెండర్ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 66,176 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో అమ్మకాలతో పోలిస్తే 5 శాతం తగ్గాయి. హైదరాబాద్‌లో 2020 ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 5,554 ఇళ్లు,ప్లాట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఏడాది అదే సమయంలో 39 శాతం పెరిగి 7,721కి చేరినట్టు ప్రాప్‌టైగర్ తెలిపింది.

Advertisement

Next Story