విషపు నురుగులో పుణ్యస్నానాలు.. వైరల్‌గా మారిన వీడియో..

by Shyam |
విషపు నురుగులో పుణ్యస్నానాలు.. వైరల్‌గా మారిన వీడియో..
X

దిశ, వెబ్ డెస్క్ : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛత్ పూజ పండుగ ఎట్టకేలకు ‘నహయ్ ఖాయ్’ అనే ఆచారంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా, పండుగ ప్రారంభానికి గుర్తుగా దేశ రాజధానిలోని యమునా నది ఒడ్డున పలువురు భక్తులు చేరారు. ముఖ్యంగా, ఛత్ పూజ అనేది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన పండుగ. ఈ పండుగ బీహార్, జార్ఖండ్ అలాగే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎక్కవగా జరుపుకుంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు నది ఒడ్డున నీటిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే, ఎప్పటిలాగే, కాళింది కుంజ్ సమీపంలో యమునా నది నీటిపై విషపూరిత నురుగు తేలుతూ కనిపించింది.

ప్రముఖ వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియో ప్రకారం, పలువురు మహిళలు కలుషితమైన నదిలో స్నానం చేస్తూ కనిపించారు, అది విషపూరిత నురుగుతో కప్పబడి ఉంది. అది పట్టించుకోని మహిళలు తెల్లటి నురుగు మధ్య మోకాళ్ల లోతు నీటిలో స్నానాలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆ నీటిని వారు తలపై పోసుకున్నారు.

NDTV నివేదిక ప్రకారం, యమునా నదిపై తేలియాడుతున్న ప్రమాదకరమైన నురుగు అమ్మోనియా స్థాయిలు అలాగే అధిక ఫాస్ఫేట్ కంటెంట్ కారణంగా సంభవించింది, దీనికి గల కారణం పారిశ్రామిక వ్యర్థలు నదిలోకి చేరడం. నదిలో కాలుష్యానికి సూచిక అయిన అమ్మోనియా శని, ఆది వారాల్లో దాదాపు 2.2 ppm (పార్ట్స్ పర్ మిలియన్) వద్ద ఉంది. ఈ వీడియోను చూపిన పలువురు నెటిజన్‌‌లు ప్రతి స్పందిస్తు “ఇది ప్రభుత్వ వైఫల్యంమని, ఆ నీరు చాలా ప్రమాదకరమని.. గార్డ్‌లు లేదా పోలీసు అందులోకి ఎవ్వరిని వెళ్లకుండా నిషేధించాలి” అని ఈ వీడియోకి వారి కామెంట్ ను ట్యాగ్ చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే ఈ సంవత్సరం, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) యమునా తీరంలో ఛత్ పూజను నిషేధించింది.

Advertisement

Next Story

Most Viewed