- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సహజీవనం చేయడానికి బాయ్ ఫ్రెండ్ కావలెను.. స్టార్ హీరోయిన్ బంపర్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టన్ కి ముచ్చటగా మూడో బాయ్ ఫ్రెండ్ కావాలట. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకొని, విడాకులు కూడా తీసుకున్న 52 ఏళ్ల హాట్ హీరోయిన్ ప్రస్తుతం ఓ మంచి ప్రియుడి కోసం వెతుకుతుంది. ఆ ప్రియుడికి ఉండాల్సిన లక్షణాలతో పాటు కొన్ని కండిషన్స్ ని కూడా పెడుతోంది. 80 వ దశకంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనిస్టన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2000 సంవత్సరంలో సూపర్ స్టార్ బ్రాడ్ ఫిట్ ను పెళ్లాడింది.
సరిగ్గా ఐదేళ్లు కొనసాగిన వీరి వైవాహిక జీవితం 2005లో ముగిసిపోయింది. ఇక ఆ తరువాత పదేళ్లు ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొచ్చిన జెన్నిఫర్ 2015లో జస్టిన్ తెరోక్స్ ను పెళ్లి చేసుకొంది. ఈ బంధాన్నికి కూడా రెండేళ్లలోనే స్వస్తి చెప్పి అప్పటినుంచి సింగిల్ స్టేటస్ ని మెయింటైన్ చేస్తున్న అనిస్టన్ తాజాగా తనకో తోడు కావాలని ప్రకటించింది. ” పెళ్లి అయితే చేసుకొను.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను” అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది. ఇక తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనే అభిలాష ఉన్నవాడై ఉండాలని తెలిపింది. అలాంటి వాడు దొరికితే పెళ్లితో సంబంధం లేకుండా సహజీవనానికి రెడీ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది.